జాతీయ స్థాయి కరాటేలో కస్తూర్బా బాలికల ప్రతిభ
బంగారు, రజత పతకాలు కైవసం చేసుకున్న కస్తూర్బా బాలికలు
హైదరాబాద్ లో బచ్చన్నపేట కస్తూర్బా విద్యార్థులకు పతకాలు అందిస్తున్న రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు లక్ష్మి
ప్రజా గొంతుక /బచ్చన్నపేట
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బచ్చన్నపేట కస్తూర్బా బాలికలు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. నిరంతర శ్రమ, సాధన, పట్టుద లతో విజేతలుగా నిలిచి బంగారు, రజత పతకాలను సాధించి ప్రశంసలందుకు న్నారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బాల బాలికలకు ఆదివారం జాతీయ స్థాయిలో ఓపెన్ కరాటే, తైక్వాండో ఛాంపియన్ షిప్ -2024 పోటీలను నిర్వహిం చారు. ఈ పోటీల్లో పాల్గొన్న బచ్చన్నపేట కస్తూర్బా బాలికల విద్యాలయం విద్యార్థి నులు కరాటే విభాగంలో బచ్చన్నపేట కస్తూర్బా పాఠశాలకు చెందిన కె.వర్షిని(9వ తరగతి), జి.సందీప్తీ(9వ తరగతి), జశ్వంతీ(6వ తరగతి)లతో పాటు మరో ఏడుగురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఒ.సంజన,జి నవ్యశ్రీ,కె.జనావి (8వ తరగతి విద్యార్థులు)మొత్తం 8సిల్వర్ పతకాలును సాధించాడు.అలాగే బార్గావి,అనుశ్రీ,సాత్వికలతో పాటు మరో ఐదుగుగు బ్రాన్స్ పధకాలు సారించారు విజేతలకు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమి వ్యవస్థాపకురాలు లక్ష్మీ రవి బంగారు, రజత పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకాడమి జిల్లా అధ్యక్షుడు దోంతుల ప్రణయ్,కస్తూర్బా ప్రిన్సిపాల్ గీత, కస్తూర్బా పీఈటీ శైలజా విద్యార్థులు పాల్గొన్నారు.