ఏ కే ఫౌండేషన్ జాబ్ మేళా కి విశేష స్పందన

ఏ కే ఫౌండేషన్ జాబ్ మేళా కి విశేష స్పందన

ప్రజా గొంతుక న్యూస్ /షేక్ షాకీర్/ నాగార్జునసాగర్ నియోజకవర్గం

ఏ కే ఫౌండేషన్ ద్వారా గ్రామీణ యువతకి ఉపాధి కల్పిస్తున్న కట్టెబోయిన అనిల్ కుమార్ సేవలు అభినందనీయం సిఎల్పి నేత,మాజీ మంత్రివర్యులు జానారెడ్డి
హాలియా పట్టణంలో ఏ కే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కి సాగర్ నియోజకవర్గం లోని యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ జాబ్ మేళాకి ఎడ్బ్రిడ్జ్, క్వెస్ క్రాప్ లిమిటెడ్,థ్రెడ్జ్ ఠెక్ లిమిటెడ్,మారుతి సుజుకి, డీమార్ట్ లిమిటెడ్,యురేక పోబ్స్ తదితర కంపెనీకి సంబందించిన ప్రతినిధులు పాల్గొని 200 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, సాగర్ ఎడమ కాలువ మాజీ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ జేడీపీటీసి రావుల బిక్షం యాదవ్, ఎపిటీసీల ఫోరం అధ్యక్షులు రావుల రాంబాబు యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,కౌన్సిలర్ సుధారాణి రాజారమేష్ యాదవ్, మాజీ ఎంపిపి చవ్వా బ్రహ్మానంద రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ కాకునూరి నారాయణ గౌడ్,మాజీ ఎంపిపి శంకర్ నాయక్, ఫౌండేషన్ సభ్యులు తుమ్మర యువత తదితరులు పాల్గొన్నారు

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *