మేడారం వెళ్తున్న మంచిర్యాల బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు
ప్రజా గొంతుక న్యూస్
బుధవారం మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు… ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి… క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….