బీఆర్ఎస్ నాయకుడు రాజా వరప్రసాద్ వ్యాఖ్యలపై ఆగ్రహాం
మీడియా లేకపోతే నీ బతుకెంత..?
కాంగ్రెస్ యువ నాయకుడు లింగారెడ్డి గూడ అశోక్
ప్రజా గొంతుక :షాద్ నగర్
“కెసిఆర్ జోలికి వస్తే చీల్చి పోగులు పెడతాం కొడకా రేవంత్ రెడ్డి” అంటూ షాద్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమీక్ష సమావేశంలో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకుడు రాజా వరప్రసాద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు తొండ ముదిరి ఉసిరివిల్లిగా మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకుడు రాజా వరప్రసాద్ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు లింగారెడ్డి గూడా అశోక్ హెచ్చరించారు. వాపును చూసి బలుపుగా అనుకుంటున్న రాజ వరప్రసాద్ తన నోటికి హద్దు పద్దు లేకుండా తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. నాయకుల మెహర్బానీల కోసం మైకు పడితే ఎవడి మీద పడితే వాడి మీద దండయాత్ర చేస్తామంటే కుదరదని ఇది బిఆర్ఎస్ రాజ్యం కాదని చీల్చి చండాడుతామని అశోక్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతున్న కెసిఆర్ కుటుంబానికి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నరు