చర్ల మండలంలోనాలుగు మెడికల్ షాపులను సీజ్
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపునిర్వహిస్తున్న నాలుగు షాపులను సీజ్ చేసినట్లు డ్రగ్ ఇన్స్ పెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. వీరు నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయించారని, నోటీసులు జారీ చేశామని కానీ వారం రోజులు గడిచినా వారి నుండి ఎటువంటి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో నాలుగు షాపులను సీజ్ చేశామని, ఇందులో రెండు షాపులు వారం పాటు, మరో రెండు షాపులు మూడు రోజుల పాటు సీజ్ చేశామని అన్నారు. కొన్ని షాపుల్లో అబార్షన్ కిట్లు కూడా అమ్మారని, అందుకు సరైన ఆధారాలు. ప్రిస్పెక్షన్స్ చూపించలేదని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా మందులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తే సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంపత్ కుమార్ తెలిపారు.