మేరీ హై స్కూల్ నందు ఘనంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం
పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ సాజు ఆధ్వర్యంలో
ప్రజా గొంతుక ఫిబ్రవరి 24 అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి గడ్డం వెంకటేష్
దమ్మపేట మండలంలోని స్థానిక సెయింట్ మేరీ హై స్కూల్ నందు పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ సాజు ఆధ్వర్యంలో శనివారం నాడు ఘనంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు దాదాపు వంద మంది వరకు సైన్స్ ప్రాజెక్ట్లను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ కీసర లక్ష్మీ మరియు హై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఉషారాణి మరియు సిబ్బంది విచ్చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి స్థానికంగా ఉన్న అన్ని పాఠశాల నుంచి విద్యార్థులు హాజరు కావడం జరిగింది.పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థులను మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ కి మరియు ఇతర పాఠశాల అధ్యాపకులు,అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.