తెలంగాణ రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా కమిటీ సభ్యునిగా కొన్నే నివాసి
బీజేపీ సోషల్ మీడియా కమిటీ సభ్యునిగా వేముల వేణుగోపాల్ గౌడ్
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల వేణుగోపాల్ గౌడ్ ను బీజేపీ సోషల్ మీడియా కమిటీ సభ్యునిగా నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.గత 5సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తు, యువమోర్చ సోషల్ మీడియా లో కీలకంగా పనిచేసినందుకు వేణుగోపాల్ గౌడ్ కు సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పజెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి వేణుగోపాల్ గౌడ్ ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.