మేరు సంఘం జెండా ఆవిష్కరణ

మేరు సంఘం జెండా ఆవిష్కరణ

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రము లో మేరు సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసిన వరంగల్ జిల్లా మేరు సంఘం అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్

ఫిబ్రవరి 28 టైలర్స్ డే పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో మేరు సంఘం మండల, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ గణేష్, అధ్యక్షతన జరిగిన టైలర్స్ డే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా మేరు సంఘం అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ మేరు , హాజరై కుట్టు మిషన్ సృష్టికర్త ఎలియాస్ హోవే చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరించారు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేరు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ వివిధ రూపాలలో టైలర్లు దుస్తులు కుట్టి మానవునికి అందాన్ని తీసుకొచ్చి సమాజంలో గొప్పగా జీవించడానికి మానవుడు వేసుకునే దుస్తులే కారణమని, మేరు కులస్తులు అనాదిగా తమ కులవృత్తి అయిన కుట్టుపని పై ఆధారపడి బీదరికంలో జీవిస్తున్నారని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. స్కూల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ కుట్టు పనిని మేరు సంఘాలు, మేరు మహిళా సంఘాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుట్టుపని చేస్తున్న సందర్భంలో కంటి చూపు మందగిస్తున్న వృత్తిని కొనసాగిస్తున్నామని 50 సంవత్సరాలు నిండిన మేరు కులస్తులకు ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మేరు సంఘం , నాయకులు కొత్తకొండ గణేష్ ,సంఘ వెంకటేశ్వర్లు, పెండ్యాల శ్రీనివాస్, కీర్తి సురేష్, రామగిరి సతీష్, రామగిరి లక్ష్మయ్య, గట్ల వరుణ్, కీర్తి రామ్మోహన్, సంఘ రాజేష్, కొత్తకొండ ఓం చందర్,కొత్తకొండ సరళ, తదితరులు పాల్గొన్నారు

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *