జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో బిఆర్ ఎస్ కు షాక్

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో బిఆర్ ఎస్ కు షాక్

ప్రజా గొంతుక జగిత్యాల/రాయికల్

బి ఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి అడువాల జ్యోతి లక్ష్మన్ ఎన్నిక

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న చైర్పర్సన్….!

జగిత్యాల మున్సిపల్ చైరపర్నన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తలిగింది. గత యేడాది బిఆర్ఎస్ చైర్పర్సన్ గా ఉన్న భోగ శ్రావణి రాజీనామా చేయడంతో చైర్ పర్సన్ పదవి ఖాళీ ఏర్పడింది….

బుధవారం జరిగిన చైర్పర్సన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన సమిండ్ల వాణి శ్రీనివాస్ కు 23 ఓట్లు రాగా బి ఆర్ ఎస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతికి 24 మంది కౌన్సిల్ సభ్యులు చేతులు లేపగ ఒక్క ఓటు తేడాతో బి ఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి అదువాల జ్యోతి విజయం సాధించారు,
స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విప్ జారీ చేసి పాల్గొని తన ఓటు హక్కు వినియోగించు కున్నప్పటికీ కూడా బిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందారు.

బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతి లక్ష్మన్ కు బిఆర్ ఎస్ కౌన్సిల్ సభ్యులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫ్ ఇండియా, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తో చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు….

చైర్ పర్సన్ గా ఎన్నికయిన జ్యోతి లక్ష్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు…..!

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *