రాజకీయ స్వార్థం కోసమే పార్టీలు మారుతున్నారు
బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
రాజకీయాలబ్ది స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారని బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ నమ్ముకుని ఉన్నారు కానీ పార్టీలు మారలేదని అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న ఏ ఒక్క కార్యకర్త పార్టీ మారరని బయట పార్టీలను వచ్చిన వారు మాత్రమే వారి రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారడం వాళ్ళ రాజకీయ స్వార్థానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థాల కోసం పార్టీలు మారే వాళ్లను ప్రజలు గమనిస్తున్నారని వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అని అన్నారు.