ఆకట్టుకున్న గురుదేవ్ స్కూల్ విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా చర్ల మండల గురుదేవ్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను,శాస్త్రీయ దృక్పథాన్ని వెలికి తీసి ప్రోత్సహించే ఉద్దేశంతో గురుదేవ్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు స్వయంగా తయారుచేసిన 116 ప్రాజెక్టు మెడల్స్ ఆకట్టుకునేలా ఉండడంతో పాటు పిల్లలు వాటి గురించి వివరించిన విధానం అద్భుతంగా ఉందని సైన్స్ ఫెయిర్ సందర్శించిన ప్రధానోపాధ్యాయులు గిరి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమం నిర్వహించిన సైన్స్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులను పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గిరి, పిటి సార్ సుధాకర్.సిహెచ్.స్వాతి.వి.రజని.ఏం విజయరాణి.సిహెచ్ సరిత.బి మౌనిక. విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు. తదితరులు పాల్గొన్నారు.