రెడ్ల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు
లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి – వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రెడ్డి -వార్ జనగామ జిల్లా అధ్యక్షులు.
రెడ్డి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కీలక భూమిక పోషించిన వెల్ఫైర్ అసోసియేషన్ ఆఫ్ రెడ్డి-రెడ్డి సంక్షేమ సంఘం
కోల్పోతున్న రెడ్ల హక్కుల సాధన లక్ష్యంగా రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో 2017లో నిర్వహించిన రెడ్ల మహాగర్జన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి గారు మూడు నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల రెడ్డి లు రాష్టవ్య్రాప్తంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వారి మంత్రివర్గ బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాలుగా వివిధ రెడ్డి సంఘాల ఎవరికి వారు పోరాటం చేయగా గత ప్రభుత్వం పటిచుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించిన విధానానికి మండి పడ్డ రెడ్డిలు అన్ని సంఘాలు ఒక్కటై రెడ్డి సంఘం తెలంగాణ అని ఒకే సంఘం గా ఏర్పడి పోరాటం చేయగా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు దిశగా ఆమోదించడం రెడ్డిల కల నేరవేర్చారు అని ఆనందం వ్యక్తం చేసారు.
వెల్ఫైర్ అసోసియేషన్ ఆఫ్ రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలోని రెడ్డి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ చేపట్టిన విషయం తెలిసిందే రెడ్లకు కార్పొరేషన్ ఏంటి? రిజర్వేషన్లు ఏంటి? అంటూ వెటకారంగా మాట్లాడిన రోజు నుండి రెడ్లలో కూడా పేదలు ఉన్నారు అని గుర్తించి, అవి సాధించే రోజు వరకు పలు రకాల ఆందోళన కార్యక్రమాలు, దీక్షలు, ధర్నాలు సభలు సమావేశాలు, అసెంబ్లీ ముట్టడిలు తదితర కార్యక్రమాలతో వెల్ఫైర్ అసోసియేషన్ ఆఫ్ రెడ్డి- వార్ పేదరేడ్ల పక్షాన నిరంతర పోరాటాల ఫలితమే ప్రస్తుత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి. వేలాదిమంది రెడ్డి ప్రతినిధులు అరెస్టులు, కేసులు ఇబ్బందులు నిర్బంధాలు ఎదుర్కొన్న గా 2019లో అగ్రవర్ణ పేదలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏర్పాటు కావడానికి, నేడు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్న రెడ్డి ప్రతినిధులకు, రెడ్డి బంధువులకు వెల్ఫైర్ అసోసియేషన్ ఆఫ్ రెడ్డి – వార్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. రెడ్ల హక్కుల సాధన కోసం రెడ్డి సంఘం తెలంగాణ నిరంతర పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యమైన మన డిమాండ్ లు పరిష్కరించిన వారికి మనం ఎప్పుడు అండగా ఉంటాం. మిగతా సమస్యలను వారి సహకారం తో సాధించుకుందాం. జై రెడ్డి….. జై జై రెడ్డి………