లోక్ అదాలత్ లో ఇరు వర్గాలకు సమన్యాయంజూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక

లోక్ అదాలత్ లో ఇరు వర్గాలకు సమన్యాయం
జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక

ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్

లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు సమన్యాయం జరుగుతుందని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జి.ఎస్.ఎల్. ప్రియాంక అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్ట్ ఆవరణలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రియాంక మాట్లాడుతూ, క్షణికావేశంలో చేసిన నేరాలకు కోర్టుల చుట్టూ తిరిగి వ్యయప్రయాసాలకు గురికాకుండా రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునని, ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించబడ్డ కేసులలో ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందనీ అన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వాహనదారులకు గత వారం రోజుల నుండి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో పలు క్రిమినల్, చెక్ బౌన్స్ , కుటుంబ తగాదాలు, భార్యాభర్తల వివాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 230 కేసులను పరిష్కరించునట్లు తెలిపారు. పలువురు న్యాయవాదులు వివిధ చట్టాలపై కక్షదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏపిపి శ్యాం ప్రసాద్, ఏజిపి మేకల తిరుపతిరెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు ఆలూరి శ్రీనివాసరావు, సుల్తానాబాద్, జూలపల్లి, శ్రీరాంపూర్ ఎస్ఐ లు శ్రవణ్ కుమార్, శ్రీధర్, ఓంకార్ యాదవ్ లతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *