ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు వేధింపులు
ఫీజులు చెల్లించిన వారికె ఎస్ఎస్సి పరీక్షలకు అనుమతిస్తామని పాఠశాల మేనేజ్మెంట్ అధ్యాపకులు
స్పష్టం చేయడం తో ఫీజులు చెల్లించని వారు ఏం చేయాలో అయోమయ దీనస్థితిలో తల్లిదండ్రులు విద్యార్థులు
కొంత మంది పేద మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు బకాయిలు కట్టలేని దీన స్థితిలో
శంషాబాద్లోని కొన్ని ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు తీరు
విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఎక్కడ.?
ప్రజా గొంతుక:రంగా రెడ్డి జిల్లా బ్యూరో
ప్రవేట్ స్కూళ్లలో విద్యాబుద్ధులు నేర్పిస్తే తమ పిల్లలు భవిష్యత్తూ లో ఉన్నతంగా ఎదుగుతారని కోటి ఆశలతో ఎదురు చూస్తే తమ ఆశలన్నీ అడియాశలు అవుతున్నాయని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ పట్టణ కేంద్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల వేట మొదలైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు పరీక్షలు 18 వ తారీకు నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అఖిరి టర్మ్ ఫీజ్ చెల్లించాలని పట్టణంలోని ప్రవేట్ పాఠశాలలో మేనేజ్మెంట్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిళ్లు తేవడంతో వేధింపులు భరించలేక తప్పనిసరి పరిస్దితుల్లో తల్లిదండ్రులు అప్పులు చేసి పూర్తిగా బకాయిలు చెల్లిస్తున్నారు. మరి కొంత మంది పేద మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు బకాయిలు కట్టలేని దీన స్థితిలో ఉన్నారు. ఫీజులు చెల్లించిన వారికె ఎస్ఎస్సి పరీక్షలకు అనుమతిస్తామని పాఠశాల మేనేజ్మెంట్ అధ్యాపకులు స్పష్టం చేయడం తో ఫీజులు చెల్లించని వారు ఏం చేయాలో అయోమయ దీనస్థితిలో తల్లిదండ్రులు విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు హాల్ టికెట్లు అందించారని పరీక్షలకు అనుమతించరేమో అని విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మీ పాఠశాలలోనే మేమో, టీసీలు, ఉంటాయి కదా అవి తీసుకునే సమయంలో చెల్లిస్తామని గోడు ను వెలబుచ్చిన కనికరం లేకుండా కఠినతరంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఎక్కడ.?
శంషాబాద్ పట్టణ కేంద్రంలో దాదాపు అన్ని ప్రైవేట్ పాఠశాలలు కొలువుదిరాయి. దాంట్లో కొన్ని పాఠశాలలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కొనసాగుతున్నాయి. మరికొన్ని పాఠశాలలో ఆఖరి టర్మ్ ఫీజు చెల్లిస్తేనే ఫైనల్ పరీక్షలకు అనుమతి ఇస్తామని ప్రవేట్ పాఠశాల మేనేజ్మెంట్ సభ్యులు తెగేసి చెప్పేశారు. పెద మద్య తరగతి విద్యార్థులు తమకు కాస్త గడువు కావాలని కోరగా … ఏలాంటి సాకులు తమకు చెప్పాల్సిన అవసరం లేదని కఠినంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలోనే మెమో, టి సి విద్యార్థుల ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు ఉంటాయి కదా.. మాకు సమర్పించే రోజు పూర్తీ బకాయిలు చెల్లిస్తామని తమ గోడును వెల్లబోసుకున్న ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రవైట్ పాఠశాలను పై అప్రతిష్ట పాలు,నిందించడం తమ ఉద్దేశం కాదని కొన్ని పాఠశాలలోనే తీరు వింతంగా ఉందని , అలాంటి పాఠశాలల పద్దతి మార్చుకొని మసులుకుంటే మంచిదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు ప్రవేట్ పాఠశాలలో ఎంత మందికి హాల్ టికెట్లు పంపిణీ చేశారో .. పర్యవేక్షణ లేకపోవడంతోనే వ్యాపారమే లక్ష్యంగా ఇష్ట రాజ్యా రాజ్యమేలుతున్నారని,మండల స్థాయి విద్యాధికారులు తప్పనిసరిగా పర్యవేక్షణ చేపట్టి వేధింపులకు గురిచేసిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున విద్యార్ధి సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు చేపట్టడానికి వెనకడబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా విద్య అధికారులు పర్యవేక్షణ చేస్తారా… లేక నామమాత్రంగా చర్యలు తీసుకొని ప్రవేట్ పాఠశాలలకు అండగా నిలుస్తారో వేచి చూడాలి.