మండల అధ్యక్షుడు కి ఘన సన్మానం
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల అధ్యక్షుడిగా నియమితమైన నూకల బాల్ రెడ్డి ని తమ్మడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శాలువలతో సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మురి ప్రతాపరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పయ్యావుల రాజయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట చందు ,మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అబ్బసాని కుమారస్వామి,రంగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ మిత్రుడికి సన్మానం
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నియమితమైన నూకల బాల్ రెడ్డి ని తన ఆత్మీయ మిత్రుడు రంగు అశోక్ శాలువాలతో సత్కరించి, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూకల బాల్ రెడ్డి ని మండల అధ్యక్షుడిగా నియమించినందుకు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి నాయకత్వంలో రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.