సీఎం రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన అమడ పురం రాజు గౌడ్
ప్రజా గొంతుక :రంగా రెడ్డి జిల్లా బ్యూరో
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అమడ పురం రాజు గౌడ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వంద రోజుల్లోనే వివిధ ప్రజావాణి ,ప్రజాదర్బార్ కార్యకలాపాలతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పరిపాలన కొనసాగిస్తూ దూకుడు పెంచారని సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రగతి సాధ్యమవుతుందని గత పాలకులు ఆర్థిక విధ్వంసం సృష్టించారని టిఆర్ఎస్ ప్రభుత్వ గత పరిపాలన విధానాన్ని విమర్శించారు. లోటు బడ్జెట్ ఉన్న కష్ట కాలంలో 6 గ్యారంటీలను విడతలవారీగా అమలు చేస్తూ తనదైన శైలిలో ప్రజా పరిపాలన సాగిస్తున్నారని అభినందించారు.