షాట్ పుట్ లో సిల్వర్ మెడల్ బత్తుల శ్రీను క్రీడాకారునికి అండగా నిలిచిన
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్
ప్రజా గొంతుక :తెలంగాణ బ్యూరో
ఖమ్మం నగరం లోని 51 వ డివిజన్ ప్రాంత నివాసి బత్తుల శ్రీను బెంగుళూర్ లో శ్రికంటిరవా అథ్లెటిక్ స్టేడియంలో 2024 మార్చి 24 వ తేదీ నుండి 26 వ తేదీ వరకు జరిగిన 6 ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ – 2024 పోటీలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం కోసం డాక్టర్ తుమ్మల యుగంధర్ని సంప్రదించగా వారు వెంటనే స్పందించి తగిన సహాయం చేసి విజయం తో తిరిగి రా అని ఆశీర్వదించారు..ఐతే బత్తుల శ్రీను ఆ పోటీలలో F -35 విభాగం లో షాట్ పుట్ లో సిల్వర్ మెడల్ సాధించారు… తన విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ యువజన కాంగ్రెస్ నాయకులు,మంగీలాల్ చౌహాన్ పొల్లూరి రమేష్ సూర్య కుమార్ బంటు చరణ్ రామ్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించి తెలంగాణ రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రోత్సహిస్తున్నారని సందర్భంగా తెలియజేశారు.