కనీస వసతులు లేని బచ్చన్నపేట బస్టాండ్

కనీస వసతులు లేని బచ్చన్నపేట బస్టాండ్

పేరుకే ఆర్టీసీ బస్టాండ్ అక్కడ కనీసం వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

మహిళలకు ఉచిత ప్రయాణంతో రద్దీగా బస్టాండ్

ప్రజా గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు, లో కనీస వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు .తెలంగాణ రాష్ట్రంలో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో బచ్చన్నపేట బస్టాండ్ రద్దీగా ఉంటుంది బస్టాండ్ వద్ద వేచి ఉండే మహిళలకు మరుగుదొడ్లు దుర్వాసన వచ్చి అందులో నీళ్లు లేక పరిశుభ్రంగా లేక ఇబ్బందులకు గురవుతున్నామనిప్రయాణికులువాపోయారు,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్లను క్లీన్ చేయించి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు. ఎండాకాలం కావడంతో ఎండలు దంచి కొడుతుండగా, కనీసం మంచినీళ్లు కూడా బస్టాండు వద్ద అందుబాటులో లేవని, ప్రయాణికులు అంటున్నారు, అపరిశుభ్రంగా పడి ఉన్న వాష్‌రూమ్‌లు దుర్వాసన వెదజల్లుతుబస్టాండ్‌కు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్టాండ్, కు చుట్టుపక్క ఇండ్లలో నివాసముంటున్న వారికి తీవ్రమైన అసౌకర్యంగా ఉండడంతో, రోగాల బారిన పడుతున్నామని ఆపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల , వల్ల మూత్ర విసర్జనలు మరియు నీళ్లు లేక పనిచేయని కుళాయిలు ఉన్నాయి. మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
బచ్చన్నపేట నుండి హైదరాబాదుకు బస్సు సౌకర్యం ఏర్పడడంతో, బచ్చన్నపేట మండల కేంద్రానికి చుట్టుపక్క మండలాల ప్రయాణికులు గ్రామాల ప్రయాణికులు ఇక్కడ నుండి హైదరాబాద్ కు నిత్యం వందలాదిమంది ప్రయాణం చేస్తున్నారని, సౌకర్యాలు లేకపోవడంతో, నాన్న అవస్థలు పడుతున్నారని ప్రయాణికులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ శుబ్రపరిచి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *