చొప్పకట్లపాలెం గ్రామంలో ఘనంగా 20వ ఉగాది వార్షికోత్సవ సంబరాలు
ప్రజా గొంతుక న్యూస్/ బోనకల్ ప్రతినిధి.మంద అశోక్
చొప్పకట్లపాలెం గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ శ్రీ శ్రీలక్ష్మీ సరోజినీ అమ్మవారి,అమ్మవారి దేవస్థానంలో కొలువుతీరిన గంగమ్మ తల్లి, సుబ్రహ్మణ్య స్వామివారిల 20వ ఉగాది వార్షికోత్సవ సంబరాలు శ్రీ లక్ష్మీ సరోజినీ అమ్మ వారి దేవస్థానం నందు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉదయం 10:00 నుండి చొప్పకట్లపాలెం శివాలయం అర్చకులు శర్మ సమక్షంలో శ్రీ లక్ష్మీ సరోజినీ అమ్మవారికి గంగమ్మ తల్లికి , సుబ్రహ్మణ్యస్వామికి పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి శ్రీ లక్ష్మీ సరోజినీ అమ్మ వారి గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలతో అంగరంగ వైభవం అలంకరణతో సన్నాయి సందడితో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో అమ్మవారి పూజారులు దారెల్లి స్వరాజ్యరావు రమణమ్మ , అమ్మవారి భక్తులు దారెల్లి విశాఖ , శ్రీకాంత్, రంజిత్, ఆకాష్, నాగేశ్వరరావు, తుంగ సుకన్య మార్కాపురి సరిత మాడుగుల రామారావు మరియు వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందినారు.