అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగం ఫలాలు అందుకుంటున్నాము,అన్ని గ్రామాల్లో మహనీయుల విగ్రహాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి::ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకులు గుండెబోయిన రవిగౌడ్
ప్రజాగొంతుక న్యూస్ /ములుగు/ ప్రతినిధి: కె అనిల్ కుమార్.
ములుగు ఏప్రిల్ 14: ములుగు మండలం సర్వాపూర్ మరియు రాయినిగూడెం గ్రామాల్లో ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపు కోవటం జరిగింది. సర్వాపూర్ అంబేద్కర్ సెంటర్ లో విగ్రహానికి పూల మాల వేసి నివాళులుఅర్పించారు. రాయినిగూడెం బస్టాండ్ సెంటర్ లో కూడ అంబేద్కర్ ఫొటో కు పూల మాల వేయడం జరిగింది ఈ కార్యక్రమం కు సిపిఎం ప్రజా సంఘాల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు గుండెబోయిన రవిగౌడ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఈరోజు రాజకీయంగా అనుభవిస్తున్న ఫలాలు అన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోని భాగమే అని అన్నారు. అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదురుకొని న్యాయ శాఖ మంత్రి గా చేయడం జరిగిందని అన్నారు. అంబేద్కర్ ఎన్నో అసమానతలు అవమానాలు ఎదురు కొని రాజ్యాంగం రాసిన వ్యక్తి గా ఎదుగడం నిజంగా అభిమానించడమే అన్నారు. ఆయన స్పూర్తితో నె ప్రజలందరూ చైతన్యం కావాలనిరవిగౌడ్ పిలుపు నిచ్చారు. ప్రతి గ్రామం లో అంబేద్కర్ విగ్రహం తో పాటు మహనీయుల విగ్రహాలు ప్రభుత్వమే తక్షణమే ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో గుండెబోయిన శ్రీహరి గౌడ్ ,సాంబయ్య గౌడ్, గైకాడి సమ్మయ్య, తిరుపతి బిక్షపతి, ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మంకిడి రవి,వజ్జ రాజు,గిరిజన సంఘం నాయకులు కార్తీక్,మంకిడి పూర్ణ చందర్ ,గొంది రవికుమార్ డబగట్ల రామస్వామి. స్వామి, సాంబయ్య,ఆగబోయిన వెంకన్న, సంజీవ తదితరులు పాల్గొన్నారు..