వైభవంగా సీత రాముల వారి కళ్యాణం
ప్రజా గొంతుక ప్రతినిధి/ సిరం దాస్ వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా
నల్గొండ దేవరకొండలో ఖిల్లా బజార్ శ్రీ ఆంజనేయ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సీత రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు, పూజారి అంజి ఆధ్వర్యంలో, హనుమాన్ గుడి వద్ద నిర్వహించిన కళ్యాణంలోకాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ సీతారాముల కళ్యాణానికి పాల్గొన్నారు దేవాలయ కమిటీ సభ్యులు సిరం దాసు వెంకటేశ్వర్లు ముసిని రమేష్ అప్పం అజయ్ పులిజాల వెంకటేశ్వర్లు రాపోలు కృష్ణ ఇడం రవి గుండు కృష్ణ నామని అనిల్ పున్న అశోక్ పున్న జగదీశ్వర్ ఉమా పాల్గొని సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.శ్రీరామ నవమి రోజున రామ నామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్య ఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీ రామ నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామ నామాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు అని అన్నారు సీతారాముల కళ్యాణం తర్వాత భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు