ఎమ్మెల్యే సారు…. మాకు నీటి ఎద్దడి సమస్యను తీర్చండి
సాయిరాంపురం గ్రామం లో నీటి ఎద్దడి
ప్రజా గొంతుక ఏప్రిల్ 17 అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి గడ్డం వెంకటేష్
ములకలపల్లి మండలం ముకమామిడి పంచాయితీ లో సాయిరాంపురం గ్రామం లో నీటి ఎద్దడి గత వారం రోజుల నుండి తాగునీరు లేక అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువెళ్లిన స్పందించని వైనం.గ్రామపంచాయతీ కార్యదర్శి నీటి ఎద్దడి సమస్యను తెలియపరచగా పంచాయితీలో నిధులు లేవని ఎత్తివేయడం జరిగిందనీ.ఏడు రోజుల క్రింద మోటార్ కాలిపోవడం వల్ల త్రాగునీటి ఎద్దటి సమస్య తో ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు పంచాయతీ కార్యదర్శులు నిధులు లేవనే చెప్పడంతో. పంచాయితీలో ఏ సమస్య తెలియపరిచిన పంచాయితీలో నిధులు లేవని తిరస్కరించడంతో ఆగ్రహం వ్యక్త పరుస్తున్న ముకమామిడి పంచాయతీ ప్రజలు.నీటి ఎద్దడి సమస్యను అధికారులు,ప్రజాప్రతినిధులు పరిష్కారం చూపకపోతే ఖాళీ బిందెలతో రహదారిని నిర్బంధం చేస్తామని హెచ్చరిస్తున్న బాధితులు. అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యకి తక్షణమే పరిష్కారం చూపాలని వేడుకుంటున్న గ్రామస్తులు.