మానవత దృక్పథంతో ఆర్థిక సహాయం అందిస్తున్న గంగం సతీష్ రెడ్డి
ఆపద బాంధవుడు గంగం సతీష్ రెడ్డి
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు,మృతులకుటుంబాలను అండగా నిలుస్తున్న గంగం సతీష్ రెడ్డి మరో నాలుగు కుటుంబాలకు అండగా నిలిచారు. జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం,కొడవటూరు గ్రామంలో నడిగట్టు మల్లయ్య ,మేక ఎర్రబీరు మల్లయ్య, ఆత్కూరి మల్లమ్మ, ముక్కెర ఐలయ్య మరణించడం జరిగింది. నాలుగు కుటుంబాలను సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి పరామర్శించి మనోధైర్యాన్ని నింపి నేనున్నానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడగకుండానే ఆర్థిక సాయం అందిస్తున్న గంగం సతీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మినలాపురం కనకయ్య, సీనియర్ నాయకులు కరికె కరుణాకర్, ఏళ్ల యాకం రెడ్డి, కందారం కనక చారి ,మల్లం రాజమల్లయ్య, పుర్మ రామ్ రెడ్డి, దండగుల యాదగిరి, యేష బోయిన బాల సిద్ధులు, కట్ట సిద్ధి లింగం, మినలాపురం చింటూ శివకుమార్, పుప్పాల గణేష్, టేకులపల్లి బాబు, తదితరులు పాల్గొనడం జరిగినది