కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
ప్రజా గొంతుక / మర్రిగూడ ప్రతినిధి నక్క సిరియాళ
మర్రిగూడ మండలం సరంపేట గ్రామ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వర్కల వెంకటేష్ మరియు ఆయన ముఖ్య అనుచరులు సుమారు 90 మంది బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీని వీడి, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వారిని ఎమ్మెల్యే ఆహ్వానిస్తూ, పార్టీలో సముచిత గౌరవం ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వర్కల వెంకటేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పనితీరు నచ్చి కాంగ్రెస్ లో చేరామన్నారు.