నూతన జర్నలిస్ట్ యూనియన్ ఏకగ్రీవ ఎన్నిక
యూనియన్ అధ్యక్షులుగా మాట్ల హరికుమార్
ప్రజాగొంతుక న్యూస్ // భీమాదేవరపల్లి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో జర్నలిస్టు యూనియన్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. మండలంలోని ముల్కనూర్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు మాడుగుల సంతోష్ కుమార్ (ప్రజాతంత్ర) ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండల జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా మాట్ల హరికుమార్ (ప్రజాపక్షం), ప్రధాన కార్యదర్శిగా మాడుగుల రామకృష్ణ (అక్షరం), ఉపాధ్యక్షులుగా బొల్లంపల్లి చరణ్ రాజ్ (సివిఆర్ న్యూస్), కోశాధికారిగా కనకం వెంకటేష్ (నినాదం), గౌరవ సలహాదారుగా ఎమ్ ఎస్ షరీఫ్ (ఎమ్ ఎస్ న్యూస్),సహాయ కార్యదర్శిగా కడారి బాబు(పీపుల్స్ డైరీ), మీడియా కన్వీనర్ గా నాగిళ్ల రజినీకాంత్ (సిరా న్యూస్), కార్యనిర్వాహక సభ్యులుగా ఆళ్ల కొండ వెంకటేశ్వర్లు (జర్నలిస్టు సూర్య), గౌడ చంద్రబాబు (భరత సింహ), బొల్లంపల్లి రాజు (ప్రజా గొంతుక), గొర్రె కుమార్ స్వామి,(వాయిస్ టుడే), బుగ్గ సుధీర్ (ఆర్.టి.ఐ నిఘ), ప్రశాంత్ (తెలంగాణ తేజ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా నియామకమైన హరికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ హక్కులు, సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పాలసీని తీసుకువచ్చే అంశంపై జర్నలిస్టులకు వివరించారు. కొత్త పాలసీతో వర్కింగ్ జర్నలిస్టులందరికీ సమన్యాయం జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా జర్నలిస్టులందరికీ సమాన హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండి, ప్రజా గళాన్ని వినిపిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో త్వరలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.