గోదావరిఖని 1 టౌన్ పరిధిలోనీ బ్యాంకుల వద్ద పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

గోదావరిఖని 1 టౌన్ పరిధిలోనీ బ్యాంకుల వద్ద పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

ప్రజా గొంతుక న్యూస్/రామగుండం

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకుల వద్ద అమాయక బాధితుల నుండి డబ్బు దొంగతనాలు, ఏటీఎం ల వద్ద మోసం చేసి డబ్బులు దొంగతనాలకు పాల్పడకుండా, ఇతర నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను తనిఖీలు నిర్వహించారు. బ్యాంక్ ల వద్ద భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే అలారం సిస్టం పనితీరు ను పరిశీలించారు. బ్యాంకు సంబంధించిన సిబ్బందితో బ్యాంకులలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే డయాల్ 100 కాని, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని
తెలపారు.
ఈ తనిఖీల్లో గోదావరిఖని వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ , సిబ్బంది పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *