చర్ల మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని,జన సేన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, నాయకులు సోమవారం కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.చర్ల మండలంలో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జన సేన నాయకులు కజ్జం.చక్రపాణి.మచ్చా.రాజా
సాయి సాకేత్.మచ్చా ప్రవీణ్
శ్రీను.గణేష్
కుక్కడపు సాయిప్రశంత్ తదితరులు పాల్గొన్నారు.