ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి– సీఐటీయూ
(ప్రజా గొంతుక న్యూస్) షేక్ షాకీర్ //నల్లగొండ జిల్లా
వైద్యా ఆరోగ్య శాఖలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు పారితోషకాల విధానం రద్దుచేసి కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు
శుక్రవారం నల్లగొండ పట్టణ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పానగల్లు ,లైన్ వాడ ,మాన్యంచెల్క మెడికల్ ఆఫీసర్లకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కు తగిన బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఆరోగ్య స్కీమ్ గా మార్చాలని అన్నారు. ఏఎన్ఎం జిఎన్ఎమ్ నియామకాలలో ఆశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రసూతి సెలవులు వేతనంతో కూడిన క్యాజువల్ లీవులు అమలు చేయాలని కోరారు. కనీస వేతనం 26,000, పిఎఫ్, ఈఎస్ఐ ,ప్రమాద బీమా, లాంటి సామాజిక భద్రత పథకాలు కనీస పెన్షన్ 10000 నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఆశాలకు పని భారం తగ్గించాలని పారితోషకాలు లేని పనులు చేయించకూడదని బూత్ లెవెల్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు చింత వజ్రమ్మ,కత్తుల సువర్ణ ,శైలజ, పద్మావతి, అనురాధ ,దేవిక, ప్రేమలత, వీరభద్రమ్మ ,సువర్ణ, శోభారాణి, రేణుక, జ్యోతి,మమత తదితరులు పాల్గొన్నారు