బహుజన వీరనారి చాకలి ఐలమ్మ.
ఐలమ్మ పేరు మహిళా కళాశాలకు పెట్టడం శుభపరిణామం.
కాంగ్రెస్ నాయకులు బీచుపల్లి యాదవ
ప్రజా గొంతుక న్యూస్/చిన్నంబావి ప్రతినిధి/సెప్టెంబర్ 11:-
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భూమికోసం, భుక్తి కోసం, వ్యట్టి చాకిరి విముక్తి కోసం, నైజాం రజాకార్లకు ఎదురు నిలిచిన దీర వనిత చాకలి ఐలమ్మ అని ఆమె పేరుతో హైదరాబాద్ కోటి మహిళ కళాశాలకు ఆమె పేరు పెట్టడం శుభ పరిణామమని కోప్పునూరు మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీచుపల్లి యాదవ్ అన్నారు.చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐలమ్మ వర్ధంతి సభకు హాజరై ఆ వీరనారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారని ఇది ముమ్మాటికి ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించడానికి ముందు ఉంటుందని ఆయన అన్నారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కులగలను చేపట్టడానికి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన అన్నారు. బిసిల హక్కుల కోసం కాంగ్రెస్ అనుక్షణం పోరాడుతుందని ఆయన అన్నారు.