వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటాం
:-ఎంపీడీవో రమణారావు
ప్రజా గొంతుక న్యూస్/చిన్నంబావి ప్రతినిధి/సెప్టెంబర్ 11:-
మండల పరిధిలోని వెల్టూరు గ్రామంలో అధిక వర్షాల కారణంగా చుట్టు పంట పొలాల నీళ్లు గ్రామంలోకి చేరి వీధులని అపరిశుభ్రంగా తయారయ్యాయని మురుగునీటిని తొలగించి వ్యాధులు ప్రబలకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులు కోరిక మేరకు బుధవారం మండలం ఎంపీడీవో రమణారావు, ఎంపీ ఓ రామస్వామి గ్రామంలోని పలు వీధులను పరిశీలించారు.విధుల గుండా నిలిచిన వర్షపు నీటిని, పంట పొలాల నుంచి వచ్చే నీటిని పాటు కాలువ ద్వారా గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నివేదిస్తామని ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, అలాగే దోమల పాగింగ్ సైతం చేయిస్తామని ఎంపీడీవో అన్నారు.గ్రామంలో వీధుల గుండా నిలిచిన నీటిని వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త కళ్యాణ్ రావు ఎంపీడీవోకు సూచించారు.. దీంతో స్పందించిన అధికారులు రెండు మూడు రోజులలో గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.అనంతరం పాఠశాలను సందర్శించి పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ధర్మేందర్, పురేందర్, గంగాధర్, సురేష్ శివ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.