బీచుపల్లి,నదిఅగ్రహారంలలో గణేష్ నిమజ్జనం ప్రాంతాలను
పరిశీలించినజిల్లాఎస్పీటి.శ్రీనివాస రావు…
ప్రజా గొంతుక న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జోగులాంబ గద్వాల జిల్లా.
జోగులాంబగద్వాలజిల్లాలో(ఐదవరోజునుండి)గణేష్నిమజ్జనంజరుగుటకు ఎక్కువ అవకాశం ఉన్నందున జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఈ రోజుజిల్లాలోపెద్దఎత్తున గణేష్నిమజ్జనం జరిగే ప్రాంతంఅయినబీచూపల్లి దగ్గర కృష్ణ నదిలో నిమజ్జన ప్రదేశంను, మరియు గద్వాల దగ్గర నది అగ్రహారం పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతచర్యలను,పోలీస్ బందోబస్తునుపర్యవేక్షించారు.
అనంతరంక్రేన్స్ఏర్పాటు చేసినస్థలాన్నిజిల్లాఎస్పీ పరిశీలించారు.
నదిప్రవాహానికి దగ్గరలో భద్రత కోసం, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాటుచేసినబారికేట్స్ నీపరిశీలించి,సంబంధిత అధికారులకు తగు సూచనలుచేశారు.నదిలో నిమజ్జనంసమయం లోఎలాంటిఅవాంఛనీయసంఘటనలుజరుగకుండా ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్ల తో ఎస్పీ మాట్లాడారు. నదిలో నీటిప్రవాహంఎంతవరకు రావచ్చు, ప్రస్తుతనీటి మట్టం,వారు ఎలాంటి ఏర్పట్లు చేసుకున్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫైర్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను ఎస్పీ కి వివరించారు. నిమజ్జనపాయింట్,దగ్గర మెడికల్ ఎమర్జెన్సీ సదుపాయాన్ని కూడా సంబంధితఅధికారులతో ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బీచూపల్లి దగ్గర ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలునిమజ్జన అయ్యవి, ఇతర జిల్లాల నుండి ఎన్ని విగ్రహాలు వచ్చాయి, ఇంకా ఎన్ని రావచ్చు, మన జిల్లా నుండి ఎన్ని వచ్చాయి, తదితర వివరాలను అలంపూర్ సి. ఐ రవి బాబుఎస్పీకివివరించారు. అనంతరం అయా శాఖల అధికారుల సమన్వయంతో గణేష్ నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండాశాంతియుతంగా జరిగేలా చూడాలని అలంపూర్ సి. ఐ కి ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో డి. ఎస్పీకెసత్యనారాయణ ఆలంపూర్ సిఐ రవి బాబు, గద్వాల్ సిఐ నాగేశ్వర రెడ్డి, గద్వాల ఎస్సైశ్రీనివాస్,ఇటిక్యాల ఎస్సైవెంకటేష్,బీచుపల్లి సెక్రటరీ, ఫైర్ సిబ్బంది, గజ ఇతగాళ్ళు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.