ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.
వినాయక విగ్రహ దాత కుచ్చలకంటి చెన్నయ్య…
ప్రజా గొంతుక,చౌడాపూర్:
సృష్టి లయకారుడు,ఆదిపరాశక్తిముద్దుబిడ్డ ఆది దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శ్రీ శివాలయం దగ్గర ప్రతీష్టించిన వినాయక విగ్రహ దాత కుచ్చలకంటి చెన్నయ్య…యూవజన సంఘాల నాయకులు భజన భక్తులు ఆకాంక్షించారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ శివాలయ దేవస్థానంలో ప్రతీష్టించిన గణపతి మండపం దగ్గర యూవజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రతీ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పూజల అనంతరం వారు మాట్లాడుతూ…నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో కాలనీవాసులు ప్రతియట గణపతి ప్రతిమను స్థాపించి ప్రత్యేక పూజలు చేయడం అభినందనీయమని అన్నారు.ప్రతి వ్యక్తికి భక్తి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని అన్నారు.మండల కేంద్రంలో వినాయకుడికి ప్రతీ రోజు పూలమాలలతో,అలంకరించి భక్తి గీతలతో భజనలు నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో పాల నర్సింలు,చాకలి యాదయ్య,పాల అంజయ్య,కావాలి నర్సింలు,కావాలి రాజు,చాకలి బంధయ్య,కావాలి శ్రీను,మహేష్,గౌరి శంకర్,కుమ్మరి పాండు,కే.లింగం,చందు,యాదగిరి,భజన భక్తులు తదితరులు పాల్గొన్నారు.