అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలి—
దండెంపల్లి సత్తయ్య
(ప్రజా గొంతుక న్యూస్) సెప్టెంబర్ 18: నల్గొండ జిల్లా ప్రతినిధి :షేక్ షాకీర్
ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తూ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఆర్జాతండాలోని మూడవ తరగతి వరకు పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
బుధవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్గొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో సిడిపిఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో మార్పులు చేస్తామని, అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ గా మారుస్తామని, మూడవ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాలలో విద్యాబోధన ఉంటుందని, ప్రతి సెంటర్ కు ఒక టీచర్ ను నియమిస్తామని 2024 జులై 19న హైదరాబాదు సచివాలయంలో విద్యావేత్తలు,విశ్రాంతి అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం ఐసిడిఎస్ కు నష్టమని, అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ఇది నూతన జాతీయ విద్యా విధానం చట్టం అమల్లో భాగమని ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జూలై 21న యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారా తెలియజేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ అంటే కేవలం విద్య మాత్రమే అని భావించడం సరికాదని అన్నారు. ఐసిడిఎస్ అంటే మాతా శిశు మరణాలను, పోషకాహార లోపాన్ని తగ్గించడం, స్కూలు మానివేసే పిల్లల సంఖ్యను తగ్గించడం లక్ష్యమని గుర్తు చేశారు. ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ బాధ్యతలు నుండి పూర్తిగా తప్పుకొని ప్రైవేటీకరణ చేస్తూ 2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. గర్భిణీ ,బాలింతలు ,చిన్న పిల్లలు,కౌమార బాలికలకు నష్టం కలిగించే ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ ) నలగొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత ,కార్యదర్శి కే.సముద్రమ్మ, ఉపాధ్యక్షురాలు పాదూరి లక్ష్మి, రాజేశ్వరి,అరుణ జ్యోతి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి, తదితరులు పాల్గొన్నారు