ఘనంగాఆశిరెడ్డిపల్లి లో గణేష్ నిమజ్జనం
ప్రజా గొంతుక న్యూస్
గండీడ్ సెప్టెంబర్ 18
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో వెలిసిన గణేషుడు ప్రతిరోజూ గణనాథుడికి నిష్ఠతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి 11 వ రోజు నిమర్జనం వేడుకలను మంగళవారం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ టెంపుల్ దగ్గర 11 రోజులుగా పూజలందుకున్న గణపయ్య చివరిరోజు ప్రత్యేకమైన పూజలందుకొని గంగమ్మ తల్లి ఒడిలోకి జేరుకున్నాడు. ఈ కార్యక్రమంలో గణేష్ ని యొక్క లడ్డు వేలం పాటలో 56000 పలకడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు మరియు పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు.