మహాలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు పత్రాలను అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు —-పేర్ల బాలు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి:: సెప్టెంబర్ 22:షేక్ షాకీర్ నాగార్జున సాగర్ నియోజక వర్గం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరియు నాగార్జునసాగర్ కుందూరు జయవీర్ రెడ్డి ఆదేశానుసారం రేషన్ డీలర్ రామడుగు యొక్క సహకారంతో ఆదివారం నాడు కుపాష్ పల్లి గ్రామంలో అభయహస్తం కార్యక్రమం ద్వారా కేవలం 500 రూపాయలకే ఎల్ పి జి గ్యాస్ సిలిండర్ ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుస్తూ అర్హులైన లబ్ధిదారులకు పత్రాలని అందించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్ల బాలు ,మాట్లాడుతూ ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలుపరుస్తూ ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందించడమే ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు.