ఇద్దరు నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ అజ్ఞాత దళ సభ్యులు అరెస్టు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దానవాయిపేట గ్రామ శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా వరంగల్ నుండి వైద్య చికిత్సలు చేయించుకుని మరలా అడవిలోకి వెళ్తున్న ఇద్దరు నిషేధిత సీపిఐ మావోయిస్టు అజ్ఞాతదళ సభ్యులను చర్ల పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్ద నుండి నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన పత్రాలను మరియు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరితో పాటు ఒక మహిళా కొరియర్ ను కూడా అదుపులోకి తీసుకోవడమైనది. పట్టుబడిన వారి వివరాలు. కరటం జోగా రాజేష్, 55, బూరుగులంక గ్రామం, కిష్టారం సూకమా జిల్లా, చత్తీస్గడ్ ఇతనిపై 20 లక్షల రూపాయల రివార్డ్ కలదు.ఇతడు మావోయిస్టు పార్టీ అగ్రనాయకులతో కలిసి బీజాపూర్ మరియు సుక్మా జిల్లాలలో భద్రతా బలగాలపై జరిగిన అనేక హింసాత్మక ఘటనలలో పాల్గోన్నాడు.పూనమ్ జోగాల్ రాజు తండ్రి చుక్కాల్, 20yrs, గొండపల్లి గ్రామం, బీజాపూర్ జిల్లా, చత్తీస్గడ్.ఏరియా కమిటీ సభ్యుడు శంకర్ మరియు ప్లాటూన్ సభ్యులు గంగా, సుక్క, ఉంగా ల సారధ్యంలో ఇతను పనిచేయడం జరిగింది. 2024 జూన్ నెలలో కరటం జోగా కు సహాయకుడిగా అతని వద్దకు వచ్చి, అతనిని వైద్య చికిత్సలకు బయటకు తీసుకొస్తూ ఉండేవాడు. ఇందులో భాగంగానే ఈ రోజు వరంగల్ లో చికిత్స చేయించుకుని వస్తుండగా పోలీసులకు పట్టుబడడం జరిగింది.ఎం.గీతా గాయత్రి, తండ్రి కీర్తిశేషులు.రాములు,43yrs,చర్ల, మావోయిస్టు పార్టీ కొరియర్ ఈమె నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సానుభూతిపరురాలిగా ఉంటూ కొరియర్ గా పనిచేస్తుంది.