శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జీవితం ఆనందంగా గడపాలి..పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

మీ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జీవితం ఆనందంగా గడపాలి..పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి :
పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ఎస్ఐ మరియు ఎ ఆర్ఎస్ఐ లను సోమవారం రోజున రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ఇద్దరు పోలీసు అధికారులను వారి కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు పదవీ విరమణ పొందిన కె. పోచయ్య ఎస్ఐ, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ 1984 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా ఎదిగి 40 సంవత్సరముల విధులను నిర్వర్తించడం జరిగింది. ఎ ఆర్ ఎస్ఐ కె. శ్రీనివాసులు, సి ఏ ఆర్ , రామగుండం ,1984 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 40 సంవత్సరముల విధులను నిర్వర్తించడం జరిగింది.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, ఎఆర్ ఎసిపి ప్రతాప్, సుందర్ , ఏఓ అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, వామన మూర్తి, సంపత్, శ్రీనివాస్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్ర సేనా రెడ్డి, మనోజ్ కుమార్, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *