కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన శ్రమలక్ష్మీ మహిళా సంఘం సభ్యులు

*కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన శ్రమలక్ష్మీ మహిళా సంఘం సభ్యులు

*ప్రజా గొంతుక న్యూస్/చిన్నంబావి ప్రతినిధి/అక్టోబర్ 01:

-చిన్నంబావి మండల పరిధిలోని అమ్మాయి పల్లి గ్రామంలో శ్రమలక్ష్మీ మహిళా సంఘం సభ్యులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి అందజేయడం జరిగింది. సంఘం సభ్యులకు జరిగిన అన్యాయంను జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగింది.సంఘం సభ్యులు మాట్లాడుతూ మా శ్రమలక్ష్మీ మహిళా సంఘాన్ని గత 20 సంవత్సరాల నడుపుకోవడం జరుగుతుంది.మా సంఘంలోని సభ్యులు 12 మంది సభ్యులు. అమ్మాయి పల్లి గ్రామ బుక్కీపర్(వి ఓ ఏ),మా సంఘంలోని సభ్యులను బుక్ కీపర్ కి అనుకూలంగా ఉన్న వారిని ఒక ముగ్గురు మా సంఘం సభ్యులకు ఎవరికి తెలియకుండా ఎలాంటి తీర్మానం చేయకుండా అ ముగ్గురిని బయటకు తీసి వారికి తోడుగా కొత్త సభ్యలను ఏడు మంది సభ్యులను తీసుకొని మొత్తము 10 మంది సభ్యులను తయారుచేసి మా సంఘం పేరు మీద పాత సంఘం అని చెప్పి యూనియన్ బ్యాంకు లో లోన్ ఇప్పించడం జరిగింది.ఆ ముగ్గురు సభ్యులు మాతో పాటు గతంలో ఓవర్సీస్ బ్యాంకు వీపనగాండ్లలో బ్యాంక్ లోను శ్రీ నిధి లోన్లు తీసుకోవడం జరిగింది.అక్కడ ఓవర్సీస్ బ్యాంకు వీపనగండ్లలో వారి పేర్లు తొలగించకుండా వారికి జటప్రోలు యూనియన్ బ్యాంకు లోన్ ఇప్పించడం జరిగింది.మా సంఘం పేరుమీద కొత్తవారికి డాక్యుమెంటు తయారుచేసి బుక్ కీపర్ సీసీ కలిసి బ్యాంకులో లోన్లు ఇపించడం జరిగింది అని తెలియజేశారు.మా సంఘం పేరు మీద మాకు తెలియకుండా కొత్త వారికి ఎలా లోన్ ఇప్పిస్తావని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంక్వయిరీ కు వచ్చిన అధికారులు డిపిఎం ఏపీఎం సీసీ మాట్లాడుతూ అలా చేయడం తప్పే కానీ వారిలాగే మీకు కూడా లోన్ ఇప్పిస్తాము మీరు ఈ విషయాన్ని పెద్దగా చేయొద్దని చెప్పడం జరిగింది, అధికారులు సీసీ,బుక్ కీపర్, ఇలాగా ఎన్ని అవినీతి అక్రమాలు చేస్తారు అనీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది.మా గ్రామంలోనే కొన్ని సంఘాల దగ్గర బుక్ కీపర్ గారి ఇంటిలో బ్యాంకు మిత్ర కొన్ని నెలలు మహిళా సంఘాల బ్యాంకు లోన్లు డబ్బులు నెల నెలా కట్టించుకుని ఆ డబ్బులను బ్యాంకులో జమ కట్టలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత గ్రామంలోని కొంతమంది ఏపిఎమ్,సిసి, ను వివరములు అడగడం జరిగింది. ఈ విషయంలో తప్పు జరిగిందని ఏపిఎం,సిసి, మాట్లాడుతూ బుక్కీపర్ నెలనెల మహిళా సంఘాల ద్వారా డబ్బులు కట్టించిన తర్వాత రసీదులు ఇప్పియ్యాల కానీ ఇప్పియ్యలేదు మరి బ్యాంకు మిత్ర బ్యాంకులో డబ్బులు జమ చేసిందా లేదా అని చూడాల్సిన బాధ్యత బుక్కీపర్ మీద ఉన్నది కానీ చూడలేదు బుక్కీపుర్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది.మా శ్రమలక్ష్మి సంఘం సభ్యులకు అన్యాయం చేసిన సిసి,బుక్కీ పర్ (విఓఏ), పై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని అని తెలియజేయడం జరిగింది.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *