అహింసే ఆయుధం… అందరికి ఆదర్శం మహాత్ముని జీవితం
పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి : ఇరుకుల్ల వీరేశం
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి జయంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ,పోలీస్ అధికారులు గాంధీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ…జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని, గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని, గాంధీ చూపిన బాటలో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలను అందించాలని సూచించారు.2ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ దామోదర్, మల్లేశం, ఆర్ ఎస్ఐ లు అనిల్, శ్రావణి, పోచలింగం, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.