మద్యం సేవించి వాహనం నడిపి మీ విలువైన జీవితాన్ని కోల్పోవద్దు. ఎస్ ఐ. శ్రావణ్ కుమార్
.ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్ రామగుండం పోలీస్ కమిషనర్ ఏం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రావణ్ కుమార్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున తమ సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు .ఈ సందర్భంగా ఎస్సై శ్రావణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్యపానం సేవించి వాహనం నడపరాదని అలా నడిపి తమ విలువైన జీవితాన్ని కోల్పోవడమే కాకుండా ఇతర వాహనదారులకు ప్రమాదాలు గురిచేసే అవకాశం ఉందని వాహనం నడిపేటప్పుడు వాహనదారుడు తమ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించాలని, సురక్షితమైన ప్రయాణం చేసి ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ గమ్యాన్ని చేరుకోవాలని పలు సూచనలను వాహనదారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.