నిషేధిత మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల అరెస్టు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ అదేవిధంగా సిఆర్పిఎఫ్ 141′ సి’ సిబ్బందితో చర్ల మండలం తా niలిపేరు డ్యామ్ కి దగ్గరలో ఉన్న టేకు ప్లాంటేషన్ అడవి ప్రాంతంలో ఏరియా డామినేషన్ చేస్తుండగా ఆరుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది.పట్టుకున్న ఆరుగురిలో ఒక వ్యక్తి దగ్గర ప్లాస్టిక్ సంచి ఉండగా దాన్ని తనిఖీ చేయగా అందులో ఎలక్ట్రికల్ వైరు కలిగి ఉన్న ప్రెషర్ కుక్కర్ ఉన్నది. వారిని విచారించగా అట్టి వ్యక్తులు నిషేధిత మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా పనిచేస్తున్నారని తెలిపినారు.పట్టుబడిన వారుమడకం దేవ రింకు తండ్రి దూల,25 వ్యవసాయం,నివాసం చెన్నాపురం చర్ల మండలం.సోడి ఉంగ తండ్రి: ఇడుమ,25 సంవత్సరాలు,వ్యవసాయం, నివాసం:చెన్నాపురం.చర్ల మండలం.సోడి కొస తండ్రి మూక, 21 సంవత్సరాలు,వ్యవసాయం,నివాసం చెన్నాపురం. చర్ల మండలం.మడకం ఇడుమ. తండ్రి గంగ, 21 సంవత్సరాలు,వ్యవసాయం, నివాసం:చెన్నాపురం. చర్ల మండలం.కలుమ అడుమ తండ్రి దేవా, 29 సంవత్సరాలు, వ్యవసాయం, నివాసం:చెన్నాపురం గ్రామం చర్ల మండలం.కొవ్వాసి భీమయ్య తండ్రి దేవయ్య 35 సంవత్సరాలు, వ్యవసాయం,నివాసం చెన్నాపురం గ్రామం చర్ల మండలం.పట్టుబడిన వీరి వద్ద నుండి ప్రెషర్ కుక్కర్ బాంబును స్వాధీనం చేసుకోవడమైనది.అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పోలీసు వారికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమములో డి.ఎస్.పి మణుగూరు వి.రవీంద్ర రెడ్డి,ఎస్ హెచ్ ఓ చర్ల ఎ.రాజు వర్మ, ఎస్సై ఆర్.నర్సిరెడ్డి. 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్, 81 సిఆర్పిఎఫ్బిటాలియన్ అధికారులు పాల్గొన్నారు.