రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం
ప్రజా గొంతుక న్యూస్/ చౌటుప్పల్యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ సమాచార హక్కు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్ర సమాచార కమిషనర్ లను నియమించకుండా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సమాచార హక్కు దరఖాస్తులు వేల కొద్ది పెండింగ్ లో ఉండడం వల్ల సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అవుతుందని వాటిని పరిష్కరించేందుకు సమాచార కమిషనర్ లను వెంటనే ప్రభుత్వం నియమించాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయల్లో సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే సమాచార హక్కు బోర్డులను ఏర్పాటు చేసి దరఖాస్తు దారులకు సహకరించాల్సిందిగా వారు కోరారు. అనంతరం నూతన సభ్యులకు నియామక పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాపోలు లింగస్వామి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి పగడాల దేవయ్య, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కండే వెంకట్, జిల్లా కార్యదర్శి సిలివేరు రమేష్, ధనుంజయి, బీ.శంకర్, బుగ్గ రాములు, తప్పటి ఆంజనేయులు, ఐతరాజు అశోక్, కత్తుల రవి తదితరులు హాజరయ్యారు.