మీ రక్షణ కోసమే – మేమున్నాం. పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.

మీ రక్షణ కోసమే – మేమున్నాం. పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.

ప్రజా గొంతుక న్యూస్/రామగుండంరామగుండం కమీషనరేట్ పోలీసు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ వారిచే రామగుండం పోలీస్ కమీషనరేట్ షీ టీమ్ విభాగానికి జారిచేయబడిన టీజింగ్, ర్యాగింగ్, వర్క్ ప్లేస్ హరస్మెంట్, సోషల్ మీడియా హరస్మెంట్, తల్లితండ్రులు పిల్లలపై దృష్టి అవగాహన సంబందించిన గోడ పత్రికలను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్, అధికారులు, షీ టీమ్ సిబ్బంది తో కలిసి పోస్టర్స్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ఎవరైనా మిమ్మల్ని ఫేస్ బుక్,ఇన్స్ట్రా గ్రామ్ ,వాట్సాప్, స్నాప్ చాట్ ,టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురిచేసిన, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసిన, మీరు పని చేస్తున్న ప్రదేశంలో ఎవరైనా మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వెంటనే షీటిమ్స్ వారిని సంప్రదించాలని, మీరు పని చేసే ప్రదేశాలలో స్వేచ్ఛగా , సురక్షితంగా పనిచేయడం ఒక మహిళ ఉద్యోగిగా మీ హక్కు అని, పిల్లల, విద్యార్ధినిల యువతుల, మహిళల రక్షణే ప్రధాన లక్ష్యమని మీరు ఎవరివలనైనా ఇబ్బందికి గురైతే భయపడకండి.. ధైర్యంగా ఉండండి.. వెంటనే డయాల్ 100, స్థానిక పోలీస్ అధికారులను, రామగుండం పోలీస్ కమీషనరేట్ షీ టీమ్స్ వాట్సాప్ 6303923700, ఫేస్బుక్ : Sheteam Ramagundam, ట్విట్టర్ : Sheteamrgm, ఇంస్టాగ్రామ్: sheteamrgm ల ద్వారా సంప్రదించండి… మీ రక్షణ కోసమే – మేమున్నాం అని తెలిపారు. తల్లిదండ్రులు రోజు కాసేపు మీ పిల్లలతో మాట్లాడండి, సరదాగా సమయం కేటాయించాలి. సమాజంలోని మంచి చెడుల గురించి అర్థమయ్యేలా వారికీ చెప్పండి, పిల్లలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ ల గురించి పూర్తి అవగాహన కలిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, మంచిర్యాల జోన్ సిటీ ఇన్చార్జి ఎస్ఐ హైమ, పెద్దపెల్లి, మంచిర్యాల జోన్ పరిధి షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *