తెలంగాణ టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జాయింట్సెక్రటరీగా ఆలేటి సంపత్ కుమార్.
ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్ తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఆలేటి సంపత్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆలేటి సంపత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.టగ్ ఆఫ్ వార్ క్రీడల్లోగ్రామీణ స్థాయి , నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులు గా తీర్చిదిద్దినందుకు వారి సేవలను గుర్తించిన రాష్ట్ర క్రీడా అసోసియేషన్ , రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం లో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారని అన్నారు. ఈ సందర్భంగా సంపత్ ను జిల్లా టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ అధ్యక్షులు వరప్రసాద్, రాజన్న,జిల్లా యువజన , క్రీడా శాఖ అధికారి అక్క పాక సురేష్ ,ఉమ్మడి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బాధ్యులు నందెల్లి మహిపాల్, కసిరెడ్డి జనార్దన్, పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఆలేటీ సంపత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని,నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ కొరిమి సంతోష్ ,సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, ఉపాధ్యక్షులు మిట్ట శ్రీనివాస్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ సీనియర్ క్రీడాకారులు బైరవని రవీందర్, గెల్లు మధుకర్ యాద,వ్ బాలసాని రాజకుమార్, దాసరి ప్రసాద్, దాసరి రమేష్ ,పాక మహేష్, బండ సదానందం, సిలివేరి మహేందర్, శ్రీనివాస్, ఇక్బాల్, నూక రాందాస్ పాల్గొన్నారు.