చర్ల మండలం లో స్వల్ప భూకంపం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంఏజెన్సీలో అన్ని గ్రామాలలో బుధవారం ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో, 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా భయాందోళనకు గురిచేశాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామపంచాయతీలలో, సరిహద్దు మండలాలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకంపనులు సంచలనం సృష్టించాయి. ఆడవుల్లో చెట్లు కూలినట్లు కూడా సమాచారం. దీంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళన గురయ్యారు. ప్రజలు ఇండ్ల నుండి బయటికి పరుగులు తీశారు. ఏమి జరుగుతుందోనని భయాందోళనలకు గురయ్యారు.గతంలో ఆగస్టు 31 రాత్రి క్లౌడ్ బరస్ట్ కారణంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి మారు 500 ఎకరాలలో విస్తీర్ణంలో 78000 పైగా చెట్లు కూలిపోయి జాతీయస్థాయిలో సంచలనగా మారింది. ఇలా ప్రకృతి వైపరీత్యాలకు ఏజెన్సీ ప్రజలు నానా అవస్థలు పడుతుంటే మరోవైపు భూకంపంతో బయట కు పరుగులు పెట్టాల్సి వచ్చింది.కాగా జిల్లాలో భూకంప రియాక్ట్ స్కేల్ పై దాదాపు 5.3 ఐదు పాయింట్ మూడు భూమి కనిపించినట్లు అధికారికంగా సమాచారం. ఏజెన్సీ వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను దాదాపు పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెలిగించారు.