అక్రమంగా సింగరేణి కాపర్ వైర్ దొంగిలించి రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొన్న పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు.
ప్రజా గొంతుక న్యూస్/రామగుండం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడికే 2 ఇంక్లైన్ మైన్ పరిధిలో ఉన్న సింగరేణి కి సంబంధించిన కాపర్ వైర్ ని దొంగిలించి అక్రమంగా హైదరాబాద్ కు రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గోదావరిఖని అడ్డగుంటపల్లి వద్ద అనుమాన స్పదంగా వస్తున్న టీఎస్ 02 యు డి 3451 నెంబరు గల మహేంద్ర ట్రాలీ ని ఆపి తనిఖి నిర్వహించగా అందులో 65 కిలోల కాపర్ వైర్ ను గుర్తించిన పోలీసులు డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు దొంతుల శ్రీనివాస్, ముత్యాల ఐలయ్య డ్రైవర్ అని రెండు రోజుల ,క్రితం 2 ఇంక్లైన్ గోదావరిఖని మైన్ నుండి దొంగలు తనం చేసి దొంతుల శ్రీనివాస్ స్క్రాప్ దుకాణంలో ఉంచి బుధవారం రోజున అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నామనితెలిపారని పోలీసులు ఒకరు ప్రకటనలు తెలిపారు. నిందితులిద్దరిని, ట్రాలీ ని, అందులో ఉన్న కాపర్ వైర్ స్వాధించేసుకొని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ వారికి అప్పగించారు.*నిందితుల వివరాలు*దొంతుల శ్రీనివాస్ (59) అడ్డగుంటపల్లి, గోదావరిఖని.ముత్యాల ఐలయ్య (53) అడ్డగుంటపల్లి గోదావరిఖని.