సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోపేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి.
ఏడుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్.
ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్ రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామ శివారు ప్రాంతంలో, కొంతమంది జూదరులు రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్ళని పట్టుకుని వారి వద్ద నుండి 10480/- రూపాయల నగదు, ఏడు సెల్ ఫోన్లు ని స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం సుల్తానాబాద్ పోలీస్ వారికి అప్పగించారు.నిందితుల వివరాలు.బిజిగిరి మల్లేష్, గర్రెపల్లి. బొట్ల రమేష్ , దూలికట్ట. జెట్టి సంపత్ , గర్రెపల్లి. గీకురు సంపత్ , గర్రెపల్లి. మద్దెల సుదాకర్ , నరసయ్య పల్లి . బొల్లం లక్ష్మణ్ , గర్రెపల్లి. గాజుల కిరణ్‌కుమార్ , గర్రెపల్లి.