ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి

.పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.

ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్ వార్షిక తనీఖీల్లో భాగంగా రామగుండం సర్కిల్ ఆఫీస్, రామగుండం పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్ గురువారం రోజున తనీఖీ చేశారు.తనీఖీ లో భాగంగా రామగుండం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్‌ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్‌ కమిషనర్‌ డిసిపి , ఎసిపి ల తో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు .అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును,రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు ,నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పోలీస్ కమిషనర్ సబ్ ఇన్స్ స్పెక్టరు ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీంచారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు . నేరాల కట్టడి కొసం అధికారులు మరింత శ్రమించడంతో పాటు, నేరం జరిగిన వెంటనే స్టేషన్‌ అధికారులు వేగంగా స్పందించాలని చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్స్టే షన్ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, ముందస్తూ సమాచార సేకరణ అవరమని, బ్లూ క్లోట్స్ సిబ్బంది డయాల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలంకి త్వరగా చేరుకోవాలని సూచించారు. వారి తో అక్కడ పరిస్థితి కంట్రోల్ కానప్పుడు వెంటనే ఎస్ఐ ,సిబ్బందికి సమాచారం అందించి వెంటనే పిలిపించుకోవాలన్నారు. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది విసబుల్ పోలిసింగ్ నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.ఈ తనిఖిల్లో పెద్దపల్లి దికిపిఒ చేతన .,గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్,రామగుండము సి ఐ ప్రవీణ్ కుమార్ ,రామగుండము ఎస్ఐ సంద్యారాణి ,ఎన్టిపిసి ఎస్ఉ ఉదయ్ కిరణ్ ,అంతర్గం ఎస్ ఐ వెంకట్ ఉన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *