అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న నాయకుల ముందస్తు అరెస్ట్
ప్రజా గొంతుక ఓదెల ప్రతినిధి :ఓదెల మండలంలోని మాల మహానాడు నాయకులను పొత్కపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాల మహనాడు సంఘం నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. రాష్ట్ర మాల మహానాడు పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఓదెల మండల నాయకులు రాజుల కిషన్, మద్దెల నరసయ్య, కరుణాకర్, జితేందర్ ,శ్రీనివాస్,రమేష్, భూమయ్య, కోడం శ్రీనివాస్, ముద్దమల్ల రమేష్ లను పోలీసులు అరెస్టు చేసి తదనంతరం విడుదల చేశారు.