సుల్తానాబాద్ ఖోఖో కేలో ఇండియా కోచింగ్ సెంటర్ క్రీడాకారిణి జీ,వైష్ణవి జాతీయ స్థాయి ఖోఖో లో ఎంపిక.
ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్
ప్రతిష్టాత్మకంగా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన ఖోఖో కేలో ఇండియా శిక్షణ శిబిరం సెంటర్ నుండి ఖోఖో అంతర్జాతీయ క్రీడాకారుడు, పెద్దపెల్లి జిల్లా కేలో ఇండియా కోచ్ గెల్లు మధుకర్ యాదవ్ శిక్షణలో జాతీయస్థాయి ఖోఖో క్రీడలో జీ.వైష్ణవి ఎంపిక కావడం జరిగింది. ఈనెల డిసెంబర్ 26నుండి 30వరకు కేరళరాష్ట్రం తిరుచునాపల్లి శాతవాహన యూనివర్సిటీలో జరుగు ఖోఖోలో జాతీయ స్థాయిలో ఎంపిక కావడం పట్ల డి వై ఎస్ఓ సురేష్ , స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముత్యాల రవీందర్ , సిఐ సుబ్బారెడ్డి, పిఈటి దాసరి రమేష్ , పి.డి శంకరయ్య, పి.డి శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు గాజుల రాయమల్లు, పారుపల్లి ఉమాపతి, కుమార్ కిషోర్, బి.రవీందర్, ప్రసాద్, మహేందర్, యునిష్ పాషా, పారుపల్లి గుణపతి, ముస్తఫా, పిడి ప్రణయ్, ఆలేటి సంపత్ కుమార్, అజ్జు తదితరులు జాతీయ స్థాయిలో ఎంపిక అయిన జీ. వైష్ణవికి, కేలోఇండియా కోచ్ గేల్లు మధుకర్ యాదవ్ కు అభినందనలు తెలియజేశారు.